టీడీపీ ఖాతాలో మరో పదవి! - వైఎస్సార్సీపీకి హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా - Municipal Chairperson Resign to YCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 20, 2024, 5:11 PM IST
Hindupur Municipal Chairperson Indraja Resigned to YSRCP : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్సార్సీపీ మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజ తన పదవితో పాటు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మూడున్నర ఏళ్లుగా మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఆమె కొనసాగారు. తన వ్యక్తిగత కారణాలతో మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఛైర్ పర్సన్ ఇంద్రజతో పాటు మరో 8మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 30 వార్డుల్లో గెలుపొందినప్పటికీ పది మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా ఇంద్రజతో పాటు మరో తొమ్మిది మంది పసుపు కండువా కప్పుకోవటంతో ఛైర్ పర్సన్ పదవి టీడీపీ ఖాతాలో పడినట్లైంది. ఛైర్ పర్సన్ రాజీనామా ఆమోదం తెలపటంతో అతి త్వరలో టీడీపీకి చెందిన నూతన ఛైర్ పర్సన్‌ను ఎన్నుకోనున్నారు. 6వ వార్డ్ కౌన్సిలర్ డీఈ రమేష్ ఛైర్ పర్సన్ పర్సన్‌గా ఎమ్మెల్యే బాలకృష్ణ దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం.