రామోజీరావుకు హిందీ జర్నలిస్టుల సంతాప సభ - tributes to Ramoji Rao death - TRIBUTES TO RAMOJI RAO DEATH
🎬 Watch Now: Feature Video
Published : Jun 16, 2024, 10:05 PM IST
Hindi Journalists Tributes to Ramoji Rao : రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ స్వర్గీయ రామోజీరావు, తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి మాత్రమే కాదని యావత్ భారతావని గర్వించదగ్గ శిఖరం వంటి మనిషని తెలంగాణ హిందీ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు అన్నారు. వనస్థలిపురంలో రామోజీరావు సంతాప సభ ఏర్పాటు చేసి, ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఈరోజు తాము వివిధ సంస్థల్లో పని చేస్తున్నప్పటికీ గతంలో ఈటీవీలో పనిచేసిన అనుభవం, అక్కడ నేర్చుకున్న పాఠాలు తమను మంచి స్థానంలో ఉంచాయన్నారు. రామోజీ రావుతో తమకున్న పరిచయాన్ని, అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందరిని సమానంగా చూసే నిరాడంబరమైన మనిషి రామోజీరావు అని పేర్కొన్నారు. ఆయన లేని లోటు కనిపిస్తున్నా, ఆయన అందరి హృదయాల్లో చిరస్మరణీయుడిగా ఉంటారని అన్నారు. జర్నలిజంతో ఆయన దూరదృష్టి ఎంతో మంది జర్నలిస్టులను సమాజానికి అందించిందని తెలిపారు. రామోజీ రావు లేకపోయినా ఆయన ఆశయాల సాధనకు తమ వంతు కృషి చేస్తామన్నారు.