మామకు మద్దతుగా కోడలు - ఖమ్మం ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్​ కుమార్తె ఆశ్రిత - AASHRITHA ELECTION CAMPAIGN - AASHRITHA ELECTION CAMPAIGN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 12:44 PM IST

Hero Venkatesh Daughter Ashritha Election Campaign : ఖమ్మంలో నటుడు వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి కోడలు అయిన ఆశ్రిత హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికీ తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు. అపార్టుమెంట్లలో ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవుతున్నారు. మహిళలతో సరదాగా ఫొటోలు దిగుతూ కాంగ్రెస్​ను గెలిపించాలని కోరుతున్నారు. రఘురాం రెడ్డితో కలిసి ప్రచారానికి వెళ్తున్న ఆమె ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నారు.

టాలీవుడ్​ సీనియర్​ హీరో విక్టరీ వెంకటేశ్​ పెద్ద కుమార్తె ఆశ్రితను ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్​ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. దీంతో వెంకటేశ్​కు రఘురాంరెడ్డి వియ్యంకుడు అయ్యాడు. అలాగే ఆయన చిన్న కుమారుడు అర్జున్​ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిను వివాహం చేసుకున్నారు. ఆశ్రిత సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ యూట్యూబ్​ ఛానల్​లో ఇన్​ఫినిటీ ప్లాటర్ అనే కుకింగ్​​ ఛానల్​ను ప్రారంభించారు. ఆమె స్వయంగా ప్రొఫెషనల్​ బేకర్​. అలాగే ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఎవరైనా ఏదైనా సమాచారం అడిగితే యాక్టివ్​గా ఉంటూ వాటికి సమాధానాలు చెబుతూ ఉంటారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.