రోడ్డు ప్రమాదాలపై అవగాహన ర్యాలీ- ద్విచక్రవాహనదారులకు హెల్మెట్​ తప్పనిసరి - Helmet Awareness Rally - HELMET AWARENESS RALLY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 7:18 PM IST

Helmet Awareness Rally in krishna District : హైకోర్టు ఆదేశాలు, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవా అధికారుల ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తూ బంటుమిల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బంటుమిల్లి జూనియర్ సివిల్ కోర్ట్ నుంచి లక్ష్మీపురం సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బంటుమిల్లి జూనియర్ సివిల్ జడ్జి ( Bantumilli Junior Civil Judge ) M. భాస్కర్ రావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకి ముప్పు వాటిల్లుతోందని తెలిపారు. అందులో 40% మరణాలు హెల్మెట్ లేక పోవడం వల్లనే సంభవిస్తున్నాయని జడ్జి ఎం. భాస్కరరావు పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ద్విచక్ర వాహనదారులకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బంటిమిల్లి తహసీల్దార్ వై.రవికుమార్, ప్రొఫెషనల్ ఎస్సై, బంటుమిల్లి ఏఎస్ఐ, బంటుమిల్లి జూనియర్ సివిల్ కోర్ట్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.