యాసంగిలోనూ జల కళ సంతరించుకున్న కూడవెల్లి వాగు - Kudavelly Vagu in Siddipet - KUDAVELLY VAGU IN SIDDIPET
🎬 Watch Now: Feature Video
Published : Apr 5, 2024, 4:23 PM IST
Heavy Water Flow in Kudavelly Vagu in Siddipet : రాష్ట్రవ్యాప్తంగా వేసవి తీవ్రతకు వాగులు, చెరువులు ఎండిపోతున్నాయి. జలాశయాల్లో చుక్కనీరు కనిపించడం లేదు. కానీ ఈ వాగులో మాత్రం నిత్యం నీరు పరవళ్లతో ఎండిపోయిన పంటలను రక్షిస్తోంది. ఆ వాగే కూడవెల్లి వాగు.
నీటి పారుదల శాఖ అధికారులు ఈ నెల 2న గజ్వేల్ మండలం కొడకండ్ల శివారు కొండపోచమ్మ సాగర్ నుంచి ప్రధాన గేటు ద్వారా గోదావరి నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ నీరు దుబ్బాక నియోజకవర్గం తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాలకు చేరుకున్నాయి. దీని పరిధిలో సుమారు 20 చెక్ డ్యామ్‌లు ఉండగా అవి అన్నీ పూర్తిగా నిండి మత్తడి పొర్లుతుంది.
కూడవెల్లి వాగు ప్రవహించే ప్రాంతంలో సుమారు 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీంతో వాగు పరివాహక గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండు వేసవిలో కూడా ఎండుతున్న పంటకు కూడవెల్లి వాగు జీవధారగా మారడంతో ఇక్కడి ప్రాంతం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లో యాసంగి వరి పంటలు గట్టెక్కుతున్నాయని కర్షకులు చెబుతున్నారు.