సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం - పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు - Heavy rain lashed Sangareddy - HEAVY RAIN LASHED SANGAREDDY
🎬 Watch Now: Feature Video
Published : Sep 7, 2024, 1:08 PM IST
Heavy Rain In Sangareddy : సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారి కుండపోత వర్షం పడటంతో నియోజకవర్గంలోని పలు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పట్టణంలో అండర్ డ్రైనేజీ సమస్య ఉండటంతో పలు చోట్ల ప్రధాన రహదారుల్లో నీరు నిలిచి ఇబ్బందికరంగా మారాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగింది. కుండపోత వానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఒక్కసారిగా వర్షం కురవడంతో రహదారుల అన్నీ జలమయం కాగా, పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పలు కాలనీల్లో వరద నీరు చేరడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. వర్షంతో పాటు చల్లగాలులు వీస్తుండడంతో వాతావరణం ఒక్కసారి చల్లగా మారిపోయింది. కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువు అలుగు పారి ఉప్పొంగింది. పశ్చిమ మధ్య పరిసర వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ నెల 9 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది.