PM Kisan 19th Installment Status: రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర సర్కారు తీసుకొచ్చిన పథకమే పీఎం-కిసాన్. దీనికి సంబంధించి 19వ విడత లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. ఈ పథకం ద్వారా.. మొత్తం 9.4 కోట్ల మంది పైగా అన్నదాలకు లబ్ధి కలిగిందని ప్రధానమంత్రి గత విడత నిధుల విడుదల సందర్భంగా ప్రకటించారు. మరి, ఇప్పుడు ఎంతమంది ఈ సాయం అందుకోబోతున్నారు? ఆ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.
లబ్ధిదారుల జాబితా - 2025
పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన అన్నదాతలు.. ప్రతీ నాలుగు మాసాలకు ఒకసారి 2 వేల రూపాయలు అందుకుంటారు. ఈ స్కీమ్ కోసం మీ పేరు నమోదు చేసుకున్నట్టయితే.. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో.. జాబితా తనిఖీ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు 18 విడతలుగా నిధులు విడుదల చేయగా.. 19వ విడతకు సంబంధించిన నిధులు ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నట్టు సమాచారం.
మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి:
ముందుగా మీరు www.pmkisan.gov.in వెబ్సైట్ లోనికి వెళ్లాలి.
ఆ తర్వాత వెబ్‌సైట్‌లోని "Beneficiary List" అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
అనంతరం మీ చిరునామా సెలక్ట్ చేసుకోవాలి. అంటే.. రాష్ట్రం, డిస్ట్రిక్ట్, మండలం, ఊరు వివరాలను ఎంచుకోవాలి.
లబ్ధిదారుల లిస్టు కోసం ''Get Report" అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
అంతే.. ఆ గ్రామంలో ఉన్న లబ్ధిదారుల అందరి పేర్లు స్క్రీన్‌పైన కనిపిస్తాయి.
ఇన్స్టాల్మెంట్ చెక్ చేసుకోవడం ఇలా..
19వ విడత నిధులు అకౌంట్లో పడ్డాయో లేదో తెలుసుకోవడానికి.. ఈ https://pmkisan.gov.in/ పోర్టల్ లోనికి వెళ్లండి.
ఆ తర్వాత "Know Your Status" అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి, క్యాప్చా ఎంటర్ చేయాలి.
ఒకవేళ మీ వద్ద రిజిస్ట్రేషన్ వివరాలు లేనట్టయితే.. "Know Your Registration Number"పై క్లిక్ చేయాలి.
తర్వాత "Get OTP" ఆప్షన్‌పైన క్లిక్ చేస్తే.. మీ మొబైల్‌కు OTP వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేస్తే.. బెనిషియరీ స్టేటస్ స్క్రీన్‌పై మీకు కనిపిస్తుంది.
ఈ - కేవైసీ చేయించాల్సిందే..
కొంత మంది లబ్ధిదారులకు డబ్బులు రాకపోతే.. ఈ - కేవైసీ చేయించలేదని అర్థమని నిపుణులు చెబుతున్నారు.
e-KYC చేయడానికి ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ సైట్లోకి వెళ్లాలి.
అనంతరం హోమ్ పేజీలో రైట్ సైడ్‌లో ఉన్న e-KYC ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఆధార్ ఎంటర్ చేసి "Search" ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. OTP సాయంతో ఈ పని పూర్తి చేయొచ్చు.
లేకపోతే.. PM కిసాన్ యాప్‌లో Face Authentication ద్వారా కూడా కేవైసీ కంప్లీట్ చేయవచ్చు.