ఏడజూసినా నీళ్లే - జలదిగ్బంధంలో రహదారులు - ప్రజలకు రవాణా తిప్పలు - HEAVY FLOODS IN MULUGU - HEAVY FLOODS IN MULUGU
🎬 Watch Now: Feature Video
Published : Jul 27, 2024, 1:51 PM IST
Heavy Flood Flow to Mulugu : ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు రహదారులు నీట మునిగడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వర్షాలు భారీగా వర్షం కురుస్తుండడంతో గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. వాజేడు మండల పరిధిలోని టేపులగూడెం వద్ద 163వ జాతీయ రహదారి నీట మునగడంతో గత పది రోజులుగా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచింది. పోలీసులు అక్కడికి చేరుకుని భారీ గేట్స్ ఏర్పాటు చేసి అటుగా ఎవరు వాగు దాటకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
పేరూరు, చండ్రుపట్ల గ్రామాల మధ్య మర్రి మాకు వాగుపైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలంలోని జిన్నెల, పెంక వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో కలిపాక, సీతారాంపురం, తిప్పాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏటూరు నాగారం, రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ఉద్ధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 16.20 మీటర్లకు గోదావరి ప్రవాహం చేరింది.