కాళేశ్వరానికి భారీ వరద - మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తి నీటి విడుదల - Heavy Flood Flow To Kaleshwaram
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2024, 12:29 PM IST
Heavy Flood Flow To Kaleshwaram : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. గోదావరి, ప్రాణహిత నదుల పరవళ్లతో త్రివేణి సంగమం తీరం వద్ద పుష్కర ఘాట్లపై నుంచి వరద కొనసాగుతోంది.
భారీగా వస్తున్న వరద, ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహంతో మేడిగడ్డ బ్యారేజీకి 8లక్షల 52వేల 240 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. 85 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీకి 3లక్షల 92వేల 543 క్యూసెక్కుల వరద రావడంతో 66 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని అధికారులు దిగువకు పంపిస్తున్నారు. కాగా గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయి. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు.