గత ప్రభుత్వానికి సమస్యలపై చెప్పాలంటే భయమేసేది- మంత్రి సత్యకుమార్‌ ఎదుట నర్సు ఆవేదన - Health Minister Sathyakumar

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 17, 2024, 6:50 PM IST

AP Health Minister Sathyakumar: ఏపీలో ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రుయాలోని ఓపీ బ్లాక్‍, ఎమర్జెన్సీ వార్డులు, పరిపాలనా భవనం పరిశీలించారు. అనంతరం రోగులకు అందుతున్న సేవల గురించి మంత్రి సత్యకుమార్ అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకోవాలన్నా భయపడేవాళ్లమని ఓ నర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రక్షాళన దిశగా ముందుకెళుతున్నామన్నారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రిషికొండలో జగన్ హంగూ, ఆర్భాటం చూసి ఆశ్చర్యమేసిందని పేర్కొన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతాడన్నార సత్యకుమార్  ఎద్దేవా చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.