'పని చేయని పరికరాలు ఇచ్చి ఏఎన్ఎంలది తప్పు అంటే ఎలా ?'
🎬 Watch Now: Feature Video
Health Department Employees Protest in Parvathipuram : పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఏపీ ఎన్జీవో ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో 15 మంది ఏఎన్ఎంలను సస్పెండ్ చేయడం సరైనది కాదని వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కిషోర్ డిమాండ్ చేశారు. ఏఎన్ఎం లకు నాసిరకం పరికరాలు అందించారని వాటితో పరీక్షిస్తే తప్పుడు నివేదికలు వస్తున్నాయన్నారు. అధికారులు దాన్ని పట్టించుకోకుండా సిబ్బందిని సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.
Hospital Managment Protest in Manyam : హెచ్బీ, బీపీ యంత్రాలు నాసిరకం పరికరాలను అందించారని వారు ఆరోపించారు. ఆ పరికరాలు నాణ్యత ఏర్పాటుతో నిపుణులు చేత దర్యాప్తు చేయించాలని, పరికరాలు మంచివి అయితే అప్పుడు సిబ్బందిపై చర్యలు చేపట్టాలని అన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు.