హైకోర్టులో వాసుదేవరెడ్డి క్వాష్ పిటిషన్ - విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి - Vasudeva reddy case update
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 25, 2024, 3:36 PM IST
HC on AP Beverages Vasudeva Reddy Petition: ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి క్వాష్ పిటిషన్ విచారణ నుంచి హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనివాసరెడ్డి వైదొలిగారు. 'నాట్ బిఫోర్ మీ' అంటూ ఆయన తప్పుకున్నారు. వాసుదేవరెడ్డి పిటిషన్‌ను వేరే బెంచ్‌కు పంపాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా వాసుదేవరెడ్డి పని చేశారు.
వాసుదేవరెడ్డి ఏపీఎస్‌బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి విలువైన దస్త్రాలను ఈ నెల 6న కారులో అక్రమంగా తరలిస్తుండగా చూశానంటూ కంచికచర్ల వాసి గద్దె శివకృష్ణ ఫిర్యాదు చేశారు. విలువైన ఆధారాలు, వస్తువుల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలతో ఏపీ సీఐడీ వాసుదేవరెడ్డిపై ఐపీసీ 427, 379 రెడ్‌విత్ 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దీంతో వాసుదేవరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి తప్పుకొన్నారు.