రియల్ 'సింగం'- లారీకి ఎదురెళ్లి మరీ పోలీస్​ డ్యూటీ! తొక్కించేందుకు ప్రయత్నించినా తగ్గేదేలే - Policeman Stopping Truck

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 10:53 PM IST

thumbnail
రియల్ సింగం (ETV Bharat)

Policeman Stopping Truck : హరియాణా పల్​వాల్​లో ఓ పోలీస్ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారు. ఓవర్​లోడ్​తో వెళ్తున్న ఓ లారీకి ఎదురెళ్లి అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. పల్​వాల్​ ఏఎస్​ఐ వీరేంద్ర సింగ్​ తన బృందంతో కలిసి పోలీస్ చెక్​పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓవర్​లోడ్​తో వచ్చిన ఓ లారీని చెక్​ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను గమనించిన లారీ డ్రైవర్​, డివైడర్​ను దాటించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన ఏఎస్​ఐ వీరేంద్ర సింగ్​ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా లారీకి ఎదురెళ్లాడు. లారీతో వీరేంద్రను తొక్కించేందుకు ప్రయత్నించినా బెదరకుండా ఎదురు నిలబడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు, పోలీసులు లారీని ఆపారు. డ్రైవర్​ దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకున్నారు. నిందితుడిని తలీమ్​గా గుర్తించిన పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.