ETV Bharat / state

'హిందీ, ఇంగ్లీష్​ వచ్చిన వారే టార్గెట్ - సీబీఐ, ఈడీ అధికారులమని చెప్పి సర్వం దోచేస్తారు' - CYBER CRIME AWARENESS AND SECURITY

మాయమాటలు చెప్పి సర్వం దోచేస్తున్న సైబర్​ కేటుగాళ్లు - హిందీ, ఇంగ్లీష్​ భాషలు తెలిసిన వారిపై సైబర్​ నేరగాళ్ల గాలం - హైదరాబాద్​లో 10 నెలల్లో రూ.300 కోట్లు స్వాహా

Cyber Crime Awareness And Security
Cyber Crime Awareness And Security (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2024, 5:16 PM IST

Cyber Crime Awareness And Security : మాతృభాషలో మాత్రమే కాదు ఇతర భాషల్లోనూ మంచి పట్టుంది. ఇంకేముంది కెరీర్​లో దూసుకుపోవచ్చు. తక్కువ కాలంలోనే ఉన్నతస్థాయికి చేరొచ్చు. ఇది కాయిన్​కు ఒకవైపు మాత్రమే. అలా నేర్చుకున్న ఇంగ్లీష్, హిందీ భాషలు సైబర్​ మాయగాళ్ల బారినపడేలా చేస్తాయని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్​కాల్స్​కు స్పందించవద్దని సూచిస్తున్నారు.

హిందీ, ఇంగ్లీష్​ భాషలు తెలిసిన వారిపై సైబర్ గాలం : ఇప్పటి వరకూ సైబర్​ మోసగాళ్ల వలలో చిక్కేందుకు అమాయకత్వం, అవగాహనలోపమే కారణమని పోలీసులు భావించారు. వీటన్నింటికీ మించి నగరంలో ఎక్కువ మందికి హిందీ మాట్లాడటం రావటం వల్ల కూడా మోసాల బారినపడేందుకు ఒక కారణమని కారణమంటున్నారు. సీబీఐ, ఈడీ, సైబర్‌క్రైమ్‌ పోలీసులమంటూ ఫోన్‌కాల్‌ చేస్తున్న కేటుగాళ్లు హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో మాట్లాడుతూ తమని తాము పరిచయం చేసుకుంటున్నారు. ఆ రెండు భాషలు తెలిసిన వారు వేగంగా స్పందిస్తున్నారు. అదనపు ఆదాయం వస్తుందనే ఆశతో తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. జీవితంలో ఎదిగేందుకు ఊతమిచ్చే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ సైబర్‌ నేరస్థులకు వరంలా మారింది.

సైబర్‌ ముఠాలు కూడా హిందీ, ఇంగ్లీష్ భాషలు తెలిసిన యువకులకు పెద్దమొత్తంలో కమీషన్‌ ఆశచూపి ఏజెంట్లుగా మార్చుకుంటున్నాయి. వారి ద్వారానే ఉద్యోగులు, గృహిణుల, వ్యాపారులను మోసగిస్తున్నారని అప్రమత్తంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు.

చదువుకున్నోళ్లే ఎందుకంటే : నగరంలో రోజూ సుమారుగా 10-15 మంది సైబర్‌ మాయగాళ్ల బారినపడి రూ.కోట్లలో నష్టపోతున్నారు. పది నెలల వ్యవధిలో 300 కోట్లు రూపాయలు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో కుమ్మరించారు. బాధితుల్లో 80శాతం వరకు ఉన్నత విద్యావంతులు, వ్యాపారులు, ఐటీ నిపుణులే ఉండటం గమనార్హం. తాము ఫోన్‌ చేసిన వ్యక్తులకు ఇంగ్లీష్, హిందీ ఏది సౌలభ్యంగా ఉందనేది ముందుగా తెలుసుకున్నాకే మాటలు కలుపుతున్నారు. వీడియోకాల్‌ చేసినప్పుడు యూనిఫామ్‌ ధరించి కనిపిస్తారు. వేషభాషలు మార్చి ఏమార్చుతున్నారు.

ఎందుకిలా మోసపోతున్నామంటే :

  • సైబర్‌క్రైమ్‌ పోలీసులు బాధితులను దీనిపై ప్రశ్నించినపుడు బాధితుల స్పందన ఇలా ఉంది.
  • ప్రముఖ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్​మెంట్లు పెడుతున్నాం. మొదట్లో రెట్టింపు లాభాలను ఇస్తున్నారు. తీరా పెద్దమొత్తంలో సొమ్ము కట్టాక ముఖం చాటేస్తున్నారు.
  • సీబీఐ, ఈడీ, సైబర్‌క్రైమ్‌ పోలీసులమంటూ మా పాన్‌కార్డు, ఆధార్, ఇంటి అడ్రస్​ వివరాలు వరుసగా చెబుతుంటే భయపడుతున్నాం.
  • డిజిటల్‌ అరెస్ట్‌ విషయం బయటకు చెబితే ఫ్యామిలీ మెంబర్లంతా కేసుల్లో ఇరుక్కుంటారంటే ఎటూ తేల్చుకోలేకపోతున్నాం.

స్టాక్​మార్కెట్​లో పెట్టుబడుల ఆశ చూపి - హైదరాబాద్​కు చెందిన వృద్ధుడికి రూ.5.98 కోట్లు టోకరా

చోరీలు పాతకథ, ఇప్పుడంతా సైబర్‌ నేరాలే - గణనీయంగా పెరుగుతున్న కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.