ETV Bharat / bharat

మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలకు అంతా రెడీ

ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం - నవంబరు 20న ఒకే విడతలో పోలింగ్ - తేలనున్న మహావికాస్ అఘాడీ, మహాయుతి కూటముల భవితవ్యం!

Maharashtra assembly election 2024
Maharashtra assembly election 2024 (ETV Bharat & ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Maharashtra Election Campaign Ends : మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. మైకులు మూగబోగా పార్టీలు తెరవెనక ప్రయత్నాలు ప్రారంభించాయి. కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తోంది. నవంబరు 20న మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఝార్ఖండ్‌ రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మహా పోలింగ్​కు ఏర్పాట్లు
మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 288 స్థానాల‌కుగాను మొత్తం 4,136 మంది అదృష్టం పోటీ చేస్తున్నారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మహారాష్ట్రలో 9,63,69,410 మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. అందుకే 1,00,186 పోలింగ్‌ బూత్‌లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఈసీ తెలిపింది.

హోరాహోరీగా పోటీ!
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికార, విపక్ష కూటములు ఈసారి హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికార కూటమి మహాయుతిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన 81 మందిని బరిలోకి దింపింది. ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 59 మంది అభ్యర్థులను పోటీకి నెలబెట్టింది. విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ (MVA)లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్‌ పవార్‌కు చెందిన ఎన్సీపీ ఉన్నాయి. కాంగ్రెస్‌ 101 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. శివసేన యూబీటీ 95 మందిని, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 86 మందిని పోటీకి దించింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా, ఎంఐఎం కూడా తమకు పట్టుందని భావిస్తున్న 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది.

ఝార్ఖండ్​లో ఎన్నికల ప్రచారానికి తెర
ఝార్ఖండ్‌లోని 38 నియోజకవర్గాల్లో రెండో విడత ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడింది. రెండో విడతలో 38 స్థానాలకు నవంబరు 20న పోలింగ్ జరగనుంది. 38 నియోజకవర్గాల్లో 522 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా భారీగా బలగాలను మోహరిస్తోంది. ఝార్ఖండ్‌లో మొత్తం 81 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వాటిలో తొలి విడతలో ఈనెల 13న 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. 43 స్థానాలకు 683 మంది అభ్యర్థులు పోటీపడగా 66.18 శాతం పోలింగ్ నమోదైంది. ఝార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ కలిసి మహాఘట్‌బంధన్‌గా పోటీ చేస్తుండగా, బీజేపీ, ఆల్ ఝార్ఖండ్‌ స్టూడెంట్ యూనియన్‌, జేడీయూ, లోక్‌జన్‌ శక్తి రామ్ విలాస్‌ పార్టీ కలిసి ఎన్​డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.