ETV Bharat / entertainment

'తండేల్' సాలిడ్ అప్డేట్- మూడు రోజుల్లో ఫ్యాన్స్​కు ట్రీట్! - THANDEL MOVIE UPDATE

నాగచైతన్య తండేల్ : సినిమా నుంచి అప్డేట్ ఇచ్చిన మేకర్స్

Thandel Movie Update
Thandel Movie Update (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 5:25 PM IST

Thandel Movie Update : యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి లీడ్ రోల్స్​లో తెరకెక్కుతున్న సినిమా 'తండేల్'. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వాలెంటైన్ వీక్ సందర్భంగా 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల వెల్లడించింది. దీంతో మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 'బుజ్జి తల్లి' అనే పాటను నవంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఓ చైతన్య- సాయిపల్లవి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'తండేల్ రాజు బుల్లితల్లికి ప్రేమతో' ఈ లవ్ ట్రాక్ 2024లోనే సాంగ్ ఆఫ్ ది ఇయర్​ అవ్వనుందంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. తాజా అప్డేట్​తో దీంతో అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అలాగే నాగచైతన్య బర్త్ డే సందర్భంగా నవంబర్ 23న కూడా సినిమా మరో అప్డేట్ ఇవ్వాలంటుూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఇదీ కథ
ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుంది. ఈ క్రమంలో కొందరు మత్స్యకారులు పాకిస్థాన్‌ కోస్టు గార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాల గురించి ఈ సినిమాలో చూపించనున్నారు.

కాగా, ఇప్పటికే రిలీజైన వీడియో గ్లింప్స్​కు మంచి రెస్పాన్స్ లభించింది. అందులో నాగ చైతన్య రగ్గ్‌డ్ లుక్​లో కనిపించగా, సాయి పల్లవి తన క్యూట్ లుక్స్​తో ఆకట్టుకున్నారు. బోటుపై చేపల వేటకు వెళ్తున్న చైతూ 'దద్దా గుర్తెట్టుకో ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్ ఇక రాజులమ్మ జాతరే' అంటూ చెప్పే డైలాగ్‌ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సినిమాకు రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, గీతా ఆర్ట్స్ బ్యానర్​పై అల్లు అరవింద్, బన్నీ వాస్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అన్ని భాషల డిజిటల్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​ సుమారు రూ. 40 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

'తండేల్‌ కోసం నేను 9 నెలల పాటు కష్టపడ్డాను - కానీ అదొక్కటే సరిపోదు' - Naga Chaitanya Interview

బుజ్జితల్లి ఫ్యాన్స్‌కు 'తండేల్' టీమ్ సర్​ప్రైజ్​ వీడియో - Happy Birthday Sai pallavi

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.