దళితుల అణచివేతకు వ్యతిరేకంగా 11న 'దళిత సింహ గర్జన' - Harsh Kumar on Dalit Simha Garjana

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 10:39 PM IST

Dalit Simha Garjana Program on February 11th: వైఎస్సార్సీపీ పాలనలో దళితులు అణచివేతకు గురయ్యారని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల్లోనూ దళిత వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. దళితుల రక్షణ, సంక్షేమాభివృద్ధి కోసం ఫిబ్రవరి 11న తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 'దళిత సింహ గర్జన' పేరుతో సభ నిర్వహిస్తున్నట్లు హర్షకుమార్‌ తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన దళిత నాయకులతో ఆయన భేటీ అయ్యారు. సభకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు.

 ఈనెల 11న తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో దళిత సింహ గర్జన సభ ఉద్దేశ్యాన్ని హర్షకుమార్‌ వివరించారు. రాష్ట్రంలో దళితులకు సంబంధించిన 27 పథకాలను వైసీపీ ప్రభుత్వం తీసేసిందని పేర్కొన్నారు. జగన్ కు 100 శాతం ఓట్లు వేసినా దళితులను మోసం చేశారని హర్షకుమార్ పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విధానాల వలన దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. అమ్మవడి పథకానికీ జగన్ తూట్లు పొడిచారని విమర్శించారు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి, దళితుల సబ్ ప్లాన్ నుంచి ఇతర పథకాలకు నిధులు కేటాయిస్తున్నారని వాపోయారు. అంతేకాదు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన, వైఎస్సార్సీపీ నాయకుల అగడాలకు ఎదురొడ్డిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు అనేక ఇబ్బందులు పెట్టి చనిపోయేలా చేయటం ఇందుకు నిదర్శనమని హర్షకుమార్ పేర్కొన్నారు. 

'గతంలో ఎన్నడూ లేని విధంగా దళితులపై వైఎస్సార్సీపీ హయాంలో దాడులు జరుగుతున్నాయి. దళితులకు రక్షణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా, అధికారంలోకి వచ్చే పార్టీలకు దిశ, నిర్దేశం చేసేందుకు మైలవరంలో ఈ నెల 11న దళిత సింహగర్జన సభ నిర్వహించనున్నాం.' -మాజీ ఎంపీ హర్షకుమార్ 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.