LIVE : రాజీనామా పత్రంతో అమరవీరుల స్తూపం వద్దకు హరీశ్ రావు - HARISH RAO CHALLENGES REVANTH LIVE - HARISH RAO CHALLENGES REVANTH LIVE
🎬 Watch Now: Feature Video
Published : Apr 26, 2024, 10:30 AM IST
|Updated : Apr 26, 2024, 10:36 AM IST
Harish Rao Challenges CM Revanth Reddy : మాజీమంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు హామీలు అమలు చేయాలన్న హరీశ్ హామీల అమలుపై రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు హరీశ్ రావు చేరుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తానని లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని సవాల్ చేశారు. పంద్రాగస్టులోపు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. మళ్లీ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని తెలిపారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కూడా అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు.
Last Updated : Apr 26, 2024, 10:36 AM IST