విశాఖ బీచ్‌లో 'శారీ వాక్'- ర్యాంప్‌పై సందడి చేసిన వనితలు - saree walk in visakha - SAREE WALK IN VISAKHA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 12:48 PM IST
Handloom Saree Walk Beach Road Conduct by The Spirit of Vizag Society : చేనేతను ప్రోత్సహించేందుకు విశాఖపట్నం బీచ్ లో "శారీ వాక్" నిర్వహించారు. 3 కిలోమీటర్లు సాగిన ఈ వాక్ లో సుమారు 10 వేల మంది మహిళలు, యువతులు పాల్గొన్నారు. "ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ" ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు వివిధ సంప్రదాయ వస్త్రాలను ధరించి సందడి చేశారు.
చీరలో అమ్మతనం ఉంటుందని, ఇది అనాదిగా ఉన్న భారతీయ సంప్రదాయమని మంత్రి అనిత అన్నారు. భారతదేశం అంటే మదిలో మెదిలేది చీరకట్టు అని గుర్తుచేశారు. చేనేత కార్మికులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఎంతో కష్టపడి వస్త్రాలు నేస్తున్న చేనేత కార్మికులను కాపాడుకోవాలని, వారికి అండగా నిలబడాలని పేర్కొన్నారు. వారి బతుకుల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.