రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు - న్యాయం చేయాలంటూ మెకాళ్లపై నిరసన - Gurukul Teachers Protest in Hyd - GURUKUL TEACHERS PROTEST IN HYD
🎬 Watch Now: Feature Video
Published : Jun 11, 2024, 3:52 PM IST
Gurukul Teachers Protest at CM Revanth Reddy House : న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద గురుకుల అభ్యర్థులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, గురుకుల బోర్డు వల్ల తాము నష్టపోయామన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఆ సమయంలో అక్కడకి వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వాహనాలను గురుకుల టీచర్స్ అడ్డగించి తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వాపోయారు.
Gurukul Candidates Protest in Hyderabad : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురుకుల అభ్యర్థులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆయన వాహనాన్ని సీఎం ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించాలని విజ్ఞాప్తి చేశారు. పోలీసులు అభ్యర్థులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.