అప్రమత్తమైన గుంటూరు నగరపాలక అధికారులు- రెండ్రోజులు కాచి చల్లార్చిన నీరు తాగాలని సూచన

🎬 Watch Now: Feature Video

thumbnail

Guntur Municipal Commissioner Chekuri Keerthi : గుంటూరులో కలుషిత నీరు తాగి ఓ యువతి మరణించడం తీవ్ర కలకలం రేపింది. కలుషిత తాగు నీరు వల్లే ప్రజలు వాంతులు, విరేచనాలతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతో కార్పొరేషన్ అధికారులు అప్రమతం అయ్యారు. గుంటూరు నగరపాలక కమిషనర్ చేకూరి కీర్తి తెల్లవారుజామున క్షేత్ర స్థాయిలో పర్యటించారు. శ్రీనగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, సంగడిగుంట తదితర ప్రాంతాల్లో సరఫరా అవుతున్ననీటి నమునాలను పరిశీలించారు. 

Polluted water in Guntur City : గుంటూరు మెడికల్ కళాశాలలోని ప్రాంతీయ ప్రయోగశాలలోనీటి నమూనాలను సంబంధిత సిబ్బంది పరీక్షించారు. అనంతరం వారితో కమిషనర్ చేకూరి కీర్తి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్లోరిన్ శాంపిల్స్ తీసిన పలు ప్రాంతాల్లో  క్లోరిన్, నీటి నాణ్యత సాధారణంగానే ఉన్నట్లు గుర్తించారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు మరో రెండు రోజులు పూర్తి స్థాయి అప్రమత్తతతో ఉండాలని చేకూరి కీర్తి ఆదేశించారు. గుంటూరు నగర ప్రజలు మరో 2 రోజుల పాటు కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలని సూచించారు. నగరంలో తాగు నీటి సమస్యలపై వెంటనే స్పందించేందుకు కార్పొరేషన్ కార్యాలయంలో స్పెషల్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.