సరిహద్దు దాటేందుకు రూ. 10 వేలు - బాపట్ల జిల్లాలో వసూళ్ల దందా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 12:34 PM IST

thumbnail

Granite Illegal Collection in Martur: బాపట్ల జిల్లాలో అక్రమ కేసులు (Granite owners illegal cases), అధికారుల ముడుపుల దందాతో  గ్రానైట్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాలకు గ్రానైట్‌ ఎగుమతి చేవాలంటే ఓ శాఖ ఉద్యోగికి ముడుపులు చెల్లించాల్సి రావటం గ్రానైట్ పారిశ్రామిక రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తన విధులకు ఆటంకం కలిగించారంటూ ఇటీవల మైనింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురు పరిశ్రమల యజమానులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. గత నెల 30న ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఓ ప్రైవేట్ సైన్యం గుప్పిట్లో సాగే అక్రమ గ్రానైట్ పలకల ఎగుమతుల పర్వం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కానీ ఈ దందాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల బృందానికి సంబంధ బాంధవ్యాలు కొనసాగుతున్న తరుణంలో ప్రైవేట్ సైన్యం మార్టూరులో కనిపించకపోయినా అక్రమ వసూళ్ల దందా మాత్రం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నట్లు గ్రానైట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

ఇంతకుముందు బాపట్ల జిల్లా పర్చూరు, యద్దనపూడి, మార్టూరు ప్రాంతాలకు చెందిన ఓ శాఖ ఉద్యోగులు మార్టూరు ప్రాంతంలో నిత్యం సాగే అక్రమ గ్రానైట్ ఎగుమతుల (Illegal Granite Export) వ్యవహారంలో ముఖ్యభూమిక పోషించేవారు. ప్రైవేట్ సైన్యానికి అండగా వారి వెంటే పరిశ్రమల మార్గాల్లో పర్యవేక్షిస్తూ అక్రమార్కుల వసూళ్లకు అన్నీ తామై నడిపేవారు. ఈ తరుణంలో పర్చూరు, యద్దనపూడి మండలాలకు చెందిన ఇద్దరు వెనక్కి వెళ్లగా, మార్టూరు ప్రాంతంలో విధులు నిర్వర్తించే ఉద్యోగి మాత్రం వసూళ్ల దందా కొనసాగిస్తున్నాడు. సరిహద్దు దాటే లారీల నుంచి 10 వేల రూపాయలు వసూళ్ల పర్వానికి తెరలేపారని చర్చ సాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.