వైభవంగా కేశవస్వామి ఉత్సవాలు ప్రారంభం- విద్యుత్ దీపాలతో మెరిసిపోతున్న ఆలయం - కేశవ స్వామి ఆలయంలో పండుగ ప్రారంభం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 1:15 PM IST
Festival Begin With Kesava Swamy Temple: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో భీష్మ ఏకాదశి పురస్కరించుకుని శ్రీ కేశవ స్వామి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాల అలంకరణలో దేవాలయం శోభాయమానంగా దర్శనమిచ్చింది. ఈ ఆలయానికి విశేష చరిత్ర ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. త్రిలోకసంచారి అయిన నారద మహర్షి భూలోక సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గోస్తనీ నది తీరాన కేశవ స్వామివారిని ప్రతిష్ఠించినట్లు పురాణాల్లో ఉందని అర్చకులు పేర్కొన్నారు.
Divya Tirukalyana Mahotsavam at Tanuku: భీష్మ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం స్వామి వారికి మాఘ శుద్ధ ఏకాదశి రోజున అత్యంత వైభవంగా దివ్య తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతుందని పండితులు తెలిపారు. వైఘాన సాగమోత్తమంగా ఈ కళ్యాణం చేయనున్నట్లు వివరించారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామి వారి విశిష్టత, ఆలయ చరిత్రను అర్చకులు భక్తులకు వివరించారు.