ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్- కోరుకున్న చోటే వెసులుబాటు - Govt Issued Guidelines in Transfers
🎬 Watch Now: Feature Video
Government Issued Guidelines for Employees Transfers: గిరిజన ప్రాంతాల్లో రెండు సంవత్సరాలపాటు పని చేసిన ఉద్యోగులకూ బదిలీలు వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి లేదా కుటుంబసభ్యులకు ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అంధులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు, వారు కోరుకున్న చోటకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించింది. భార్యభర్తలు ఉద్యోగులైతే ఒకే ఊళ్లో పోస్టింగ్ లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగులకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. ఉద్యోగ సంఘాలు ఇచ్చే ఆఫీస్ బేరర్ల లెటర్లపై ప్రత్యేక సూచనలు చేసింది.
ఆఫీస్ బేరర్లుగా ఉన్న ఉద్యోగులకు తొమ్మిది సంవత్సరాలపాటు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. తాలూకా, జిల్లా స్థాయిల్లో ఆఫీస్ బేరర్ల లేఖలను జిల్లా కలెక్టర్లకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్ల లేఖలను జీఏడీకి పంపాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు, జీఏడీ ఆమోదం తర్వాతే బదిలీల నుంచి వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. పరిశీలన తర్వాత కూడా పరిపాలన పరంగా అవసరం అనిపిస్తే తొమ్మిదేళ్ల కాల పరిమితి పూర్తి కాకపోయినా ఆఫీస్ బేరర్లను బదిలీలు చేయవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.