గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - government changing schemes names - GOVERNMENT CHANGING SCHEMES NAMES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 18, 2024, 9:31 PM IST
Government changing the names of various schemes under YCP government : వైసీపీ ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లు మార్పు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆదేశాలతో పథకాల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జగనన్న విద్యా, వసతి దీవెనల పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా మార్పు చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెనకు అంబేడ్కర్ ఓవర్‌సీస్ విద్యా నిధిగా మార్చారు. వైఎస్సార్ కల్యాణమస్తు పథకాన్ని చంద్రన్నపెళ్లికానుకగా పునరుద్ధరించారు. వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్పు చేశారు. అదేవిధంగా జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకాన్ని, సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకంగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం హయాంలో అమలైన పథకాల పేర్లు మార్చింది. జగనన్న, వైఎస్సార్ పేర్లతో అమలు చేసింది. తాజాగా పూర్వపు పేర్లనే మళ్లీ తీసుకొస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. ఆ మేరకు వెబ్‌సైట్లు, ఇతర చోట్ల మార్పులు చేయాలని ఆదేశించింది.