గోదావరిలో క్షణక్షణం పెరుగుతున్న నీటిమట్టం - ప్రస్తుతం 26.3 అడుగులు - godavari water levels rise - GODAVARI WATER LEVELS RISE
🎬 Watch Now: Feature Video
Published : Jul 19, 2024, 4:19 PM IST
Godavari River Water Level Increases Due to Heavy Rains : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం 20 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం నేడు మధ్యాహ్నానికి 26.3 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నానపు ఘాట్ల ప్రాంతం వరకు వరద నీరు చేరుకుంది.
అలాగే భద్రాచలం ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నేడు ఉదయం ప్రాజెక్టు వద్ద అధికారులు 24 గేట్లను ఎత్తి 59,330 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు. మరోవైపు దుమ్ముగూడెం మండలంలోని సీతవాగుతో పాటు వివిధ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తున్నాయి. దీంతో వరద ప్రవాహం ఎక్కువస్థాయిలో ఉంది.