ఒకప్పుడు సైబర్ నేరాల బాధితుడు - ఇప్పుడు ఆ కేటుగాళ్ల గుట్టు విప్పే హ్యాకర్‌ - గ్లోబల్ సెక్యూరిటీ కౌన్సిల్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 4:12 PM IST

Global Security Council Founder Radha Krishna Interview : యువతనే లక్ష్యంగా చేసుకుని రుణ యాప్‌ల వేధింపులు ఎక్కువగా అవుతున్నాయి. ఇంజినీరింగ్‌ చదివి హైదరాబాద్‌లో పలు కళాశాలల్లో సైబర్‌ భద్రతపై నిరంతరం అవగాహన కల్పిస్తున్న ఓ యువకుడికి కూడా ఓ అనుకోని సంఘటన ఎదురైంది. ఆ సంఘటనతో రుణ యాప్‌ల వేధింపులకు గురయ్యాడు. చుట్టుపక్కల వారంతా తనని హేళన చేశారు. ఆ బాధతో ఏడాదిన్నరపాటు చీకిటి గదిలో మగ్గాడు. 

Global Security Council Founder Interview : బాధలో ఉన్న ఆ యువకుడికి ఓ ఐపీఎస్ అధికారి స్ఫూర్తినిచ్చాడు. సైబర్ సెక్యూరిటీ చెప్పే నీకే ఈ పరిస్థితి ఏర్పడితే మిగతా సామాన్యుల సంగతి ఏంటని ఆ అధికారి ప్రశ్నించి తీరు ఆ యువకుడ్ని ఆలోచింపజేసింది. ఆ స్పూర్తితో సదరు యువకుడు ఎథికల్ హ్యాకర్‌గా మారి సైబర్ నేరగాళ్ల భరతం పట్టడం మొదలుపెట్టాడు. రుణాల పేరుతో జరిగే మోసాలతో పాటు ఆర్థిక నేరాల కట్టడే లక్ష్యంగా గ్లోబల్ సెక్యూరిటీ కౌన్సిల్(Global Security Council) అనే అంకుర సంస్థను ఏర్పాటు చేశాడు. కేవలం అప్పు అడిగినందుకు ఆత్మహత్య చేసుకోవాలా అని ప్రశ్నించేవారు ఎథికల్ హ్యాకర్‌ రాధాకృష్ణమూర్తితో కథ తెలుసుకోవాల్సిందే.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.