అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ లీక్ - అగ్ని ప్రమాదంలో రూ.15లక్షల ఆస్తినష్టం - Fire Accident in Asifabad District - FIRE ACCIDENT IN ASIFABAD DISTRICT
🎬 Watch Now: Feature Video
Published : Jun 9, 2024, 3:35 PM IST
|Updated : Jun 9, 2024, 3:48 PM IST
Fire Accident in Asifabad District : ఆసిఫాబాద్ జిల్లాలోని బాబాపూర్ గ్రామంలో అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో మంటలు చెలరేగాయి. అదే ఇంట్లో నిలువ ఉంచిన పత్తికి అగ్గి రవ్వలు అంటుకోవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటికి పరుగులు తీశారు. గ్రామస్థులు అందరూ ఒక్కటై నీళ్లతో ఆర్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ, మంటలు ఆరక పోవడంతో జిల్లా కేంద్రంలోని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ సుమారు మూడు గంటల పాటు మంటలు చెలరేగుతూ రెండు ఇళ్లు మంటలకు పూర్తిగా ఆహుతయ్యాయి.
దీంతో సుమారుగా రూ. 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తిగా రెండు ఇళ్లు కాలిపోవడంతో ఆస్తి నష్టం జరగడంతో నిరాశ్రాయులై చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్నట్లు వాపోయారు. నిత్యవసర సరుకులు, భూముల, పొలాల పట్టా పుస్తకాలు పూర్తిగా కాలిపోవడంతో ఎటుగాని పరిస్థితి నెలకొన్నదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. పూర్తిగా కాలిపోవడంతో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.