టీడీపీ - జనసేన మేనిఫెస్టోలో స్టీల్​ప్లాంట్ అంశాన్ని చేర్చుతాం: గంటా శ్రీనివాసరావు - విశాఖ స్టీల్ ప్లాంట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 10:29 PM IST

Ganta Srinivasarao Meet Steel Plant Agitaiton Committee Members: టీడీపీ - జనసేన మేనిఫెస్టోలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని పెడతామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భవిష్యత్ కార్యాచరణపై పోరాట కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. గంటా రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించిన తర్వాత తొలిసారి నాయకులతో భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా రాష్ట్రంలో రాజీనామా చేసిన ఏకైక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. స్టీల్ ప్లాంట్​ను కేవలం పరిశ్రమగానే చూడకూడదన్నారు. స్టీల్ ప్లాంట్ విశాఖ ముఖచిత్రాన్నే మార్చేసిందని గంటా అన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెడితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆయన మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ సాధనకు 32 మంది అమరవీరుల ప్రాణ త్యాగం ఉందన్నారు. 16 వేల ఎకరాల భూములు నిర్వాసితుల త్యాగఫలం స్టీల్ ప్లాంట్ నిర్మాణామని గుర్తు చేశారు.

ఉక్కు కర్మాగారం కోసం ఇచ్చిన రాజీనామాను 3సంవత్సరాల తర్వాత ఆమోదిస్తున్నారంటే కుట్ర కోణం కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యేని తగ్గించాలన్నదే వాళ్ల లక్ష్యం. వైసీపీ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల్లో చావు దెబ్బ తినటం ఖాయం. వైసీపీ పార్టీ ఓక మునిగిపోతున్నా పడవలాంటిది. అలాంటి పడవలో ఎవరూ ప్రయాణం చేయాలని కోరుకోరు. పలువురు వైసీపీ నేతలు అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నారు. -గంటా శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నేత

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.