అన్ కాన్షియస్ అవుతున్నానంటూ అంబులెన్స్‌కి కాల్ - వచ్చిచూసేసరికి సిబ్బందికి షాక్ - drunkard call to 108
🎬 Watch Now: Feature Video
Published : Feb 2, 2024, 3:24 PM IST
|Updated : Feb 2, 2024, 3:35 PM IST
Full Drunk Man Called 108 as Emergency : ఫుల్లుగా తాగి ఎమర్జెన్సీ అంటూ 108కి కాల్ చేసి రప్పించాడు. తాను అన్ కాన్షియస్ అవుతున్నానంటూ జనగామలో తన అమ్మమ్మ ఊళ్లో దింపాలంటూ అంబులెన్స్ సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ ఘటన యాద్రాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం రమేశ్ అనే వ్యక్తి బుధవారం అర్ధరాత్రి 108కు కాల్ చేశాడు. అప్పటికే ఫుల్‌గా తాగి ఉన్న తాను స్పృహ కోల్పోతున్నానని, హైదరాబాద్ హైవేపై, జమ్మాపురం శివారులో ఉన్నానని తర్వగా రావాలని చెప్పాడు.
108 డ్రైవర్, సిబ్బందితో హుటాహుటిన అక్కడికి వెళ్లారు. బాధితుడి కోసం వెతుకుతుండగా ఫుల్లుగా తాగి ఉన్న రమేశ్ అంబులెన్స్ దగ్గరికి వచ్చాడు. ఫోన్ చేసింది తానేనని, వాళ్ల అమ్మమ్మ ఊరైన జనగామకు తీసుకెళ్లాలన్నాడు. దీంతో 108 సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. వారు ఎంత సముదాయించినా రమేశ్ వినిపించుకోలేదు. జనగామలోని అమ్మమ్మ ఊర్లో డ్రాప్ చేయాలంటూ గొడవకు దిగాడు. చివరకు బలవంతంగా అతడిని వదిలించుకొని 108 సిబ్బంది తిరుగు ప్రయాణమయ్యారు.