LIVE : తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం - Niranjan reddy live - NIRANJAN REDDY LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-04-2024/640-480-21227456-thumbnail-16x9-niranjan.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Apr 15, 2024, 12:07 PM IST
|Updated : Apr 15, 2024, 12:21 PM IST
Niranjan Reddy Live : ప్రస్తుతం రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సరైన సమయంలో సాగు నీరు అందక చేతికొచ్చిన పంట పొలాలు ఎండిపోతున్నాయి. పలుచోట్ల పశువులకు మేతగా మారుతున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీరందించే ప్రయత్నాలు చేస్తున్నా, అవి పెట్టుబడి ఖర్చు పెరగడానికి తప్ప, పంటను కాపాడటానికి ఉపయోగపడటం లేదు. ఈ క్రమంలో ఈ కరవు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమై కారణమంటూ ప్రతిపక్షాలు అదే పనిగా విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరుగుతోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవని, ప్రస్తుత పరిస్థితులకు ప్రభుత్వ చేతగాని తనమే కారణమంటూ దుయ్యబడుతోంది. పంటలు దెబ్బతిన్న అన్నదాతలకు పరిహారం చెల్లించి, ఆదుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై తాజాగా తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పాటు బీజేపీ సంకల్ప పత్ర మేనిఫెస్టో, మద్యం కేసులో కవిత సీబీఐ కస్టడీపైనా ఆయన మాట్లాడుతున్నారు.
Last Updated : Apr 15, 2024, 12:21 PM IST