పులివెందులలో మాజీ సీఎం జగన్ ప్రజా దర్బార్లో వచ్చిన విన్నపాలు ఇవే - YS Jagan Prajadarbar - YS JAGAN PRAJADARBAR
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-06-2024/640-480-21778893-thumbnail-16x9-ys-jagan-prajadarbar.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 23, 2024, 9:12 PM IST
Former CM YS Jagan Held Prajadarbar on Second Day: మాజీ సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్జిల్లా పులివెందులలోని తమ పార్టీ కార్యాలయంలో రెండవ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ క్రమంలో జగన్ ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వినతులను స్వీకరించారు. ఉదయం నుంచే నుంచే కార్యాలయం వద్దకు జగన్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో జగన్ నేరుగా ప్రజలతో తమ సమస్యలపై చర్చించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు జగన్‌కు వినతిపత్రాలు సమర్పించారు. వైసీపీ పాలనలో చేపట్టిన నిర్మాణ పనుల పెండింగ్ బిల్లుల విషయాన్ని పలువురు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు నిర్మాణాలకు చేసిన పనులుకు ఇంకా బిల్లులు రాలేదని విన్నవించారు. అక్కడకు జనాలు భారీ సంఖ్యలో రావడంతో గంటలసేపు క్యూలో నిలబడలేని వాళ్లు మాజీ సీఎంను కలవకుండానే వెళ్లిపోయారు. ప్రజా దర్బార్ వద్ద తోపులాట జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.