పాడేరు ఆస్పత్రిలో కోలుకుంటున్న చిన్నారులు - 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ - Students Recovery in Hospital - STUDENTS RECOVERY IN HOSPITAL
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-08-2024/640-480-22258629-thumbnail-16x9-student-recover.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 21, 2024, 1:24 PM IST
Food Poison Students Recovery in Hospital at Anakapalli District : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం ఆశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులు కోలుకుంటున్నారు. కలుషిత ఆహార బాధితుల్లో 8 మంది విద్యార్థులు పాడేరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరేచనాలతో వారు ఆస్పత్రిలో చేరినట్లు వైద్యురాలు రామరాజ్యం తెలిపారు. ఆరుగురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో చిన్నారులను 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచామని చెప్పారు.
కలుషిత ఆహార బాధితుల్లో 39 మంది చిన్నారులు నర్సీపట్నం, అనకాపల్లి, కోటవురట్ల ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రులు, జిల్లా అధికారులు వైద్యులతో మాట్లాడి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనాధికారికంగా కొనసాగుతున్న శరణాలయాలపై అధికారులు దాడులు చేస్తున్నారు.