విషాదాన్ని నింపిన విహారయాత్రలు- ఈత కోసం దిగి ఐదుగురు విద్యార్థులు మృతి
🎬 Watch Now: Feature Video
Three Students Died Falling into Water in Alluri District: విహారయాత్ర కోసం వచ్చి ముగ్గురు విద్యార్థులు నీటమునిగి మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని రంపచోడవరం మండలం ఐ.పోలవరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఆర్. ఎర్రంపాలెంలోని జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు స్నానం చేయటం కోసం సీతపల్లి వాగులోకి దిగారు. అందులో ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు వాగులో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు. అప్పటికే ముగ్గురూ మృతి చెందడంతో వారి మృతదేహాలను బయటికి వెలికితీశారు. మృతి చెందిన విద్యార్థులు కాకర వెంకటఅర్జున్, కేవటి రాంజీ, అన్నబోయిన దేవీచరణ్‌గా పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు ఆర్. ఎర్రంపాలెం చెందిన వారు కాగ, మరో విద్యార్థి రావలపుపాలేనికి చెందినవాడిగా పోలీసులు వెల్లడించారు.
మరో ఘటనలో ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో ఇద్దరు బాలురు చెరువులో మునిగిపోయి మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు కాలు జారీ చెరువులో పడిపోయిన సందీప్ గగన్ (17)ను రక్షించేందుకు మరో బాలుడు చందు(12) ప్రయత్నించాడు. అయితే ఇద్దరికీ ఈతరాక పోవడంతో నీటిలో మునిగి మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.