మిడ్ మానేరు జలాశయంలో జెండా వందనం - వీడియో వైరల్ - FLAG HOISTING IN MID MANAIR - FLAG HOISTING IN MID MANAIR
🎬 Watch Now: Feature Video
Published : Aug 15, 2024, 1:42 PM IST
Flag Hoisting in Mid Manair Reservoir : రాష్ట్రవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేయాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతిఒక్కరు జెండా ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు జలాశయంలో మత్స్యకారులు వినూత్నంగా జాతీయ జెండాను ఎగరవేశారు. వేములవాడ పురపాలక పరిధికి చెందిన నాంపల్లి ముదిరాజ్ సంఘం మత్స్యకారులు దేశభక్తిని చాటుకున్నారు.
Har Ghar Tiranga in Telangana : తెప్పలపై వెళ్లి మిన్ మానేరు మధ్య లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రాజెక్టులో మునిగిపోయిన తమ ఊరిలోనే జెండా ఎగురవేశారు. జలాశయంతో తమ గ్రామానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఒకవైపు నేతలు, మరోవైపు విద్యార్థులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వేర్వేరు చోట్ల పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి జాతీయ జెండాలతో నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు నిర్వహించిన స్వతంత్య్ర కాలం నాటి నాటికలు ఆకట్టుకున్నాయి.