మంచిర్యాలలో అత్తమామలపై అల్లుడి కాల్పులు - Firing in Mancherial news
🎬 Watch Now: Feature Video


Published : Feb 28, 2024, 7:22 PM IST
Firing in Mancherial : మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం సాలిగాం గ్రామంలో కాల్పులు కలకలం సృష్టించాయి. సాలిగాం గ్రామానికి చెందిన గోలేటి శంకర్, లక్ష్మీ లపై అల్లుడు గోమాస నరేందర్ మంగళవారం రాత్రి పిస్టల్‌తో ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. గత కొద్ది నెలలుగా ఆస్తి కోసం అత్తమామలు అల్లుడు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్లో నివాసం ఉంటున్న గోమాస నరేందర్ స్నేహితుడు మహేశ్‌తో కలిసి వచ్చి అత్తమామలతో గొడవకు దిగారు. వీరిపై అనుమానం వచ్చిన అత్తమామలు వెనుక తలుపులు వేసి దాక్కున్నారు.
Gun Firing : నరేందర్ తన దగ్గర ఉన్న గన్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రావడంతో అతని నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పరిశీలించారు. నిందితునిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.