అప్పు చెల్లించలేదని రూ. 4 కోట్ల ఖరీదైన కారును తగులపెట్టిన దుండగులు - fire set on Lamborghini car - FIRE SET ON LAMBORGHINI CAR
🎬 Watch Now: Feature Video
Published : Apr 15, 2024, 6:01 PM IST
fire set on Lamborghini car in Hyderabad : తీసుకున్న అప్పు ఇవ్వలేదని ఖరీదైన కారును తగులపెట్టిన ఘటన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగింది. నార్సింగ్ చెందిన వ్యాపారి నీరజ్‌కు రూ.4 కోట్ల విలువ చేసే లంబోర్ఘని స్పోర్ట్స్ కారు ఉంది. దాన్ని విక్రయిస్తానాని అయాన్‌కు చెప్పాడు. మోఘల్పురాకు చెందిన అమన్‌కు అయాన్ ఈ విషయం చెప్పాడు. అమన్ మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న అహ్మద్ అనే వ్యకి కారు కొంటానని, మామిడిపల్లిలోని తన ఫామ్ హౌస్‌కు తీసుకుని రావాలని అయాన్‌కు చెప్పాడు.
నీరజ్ వద్ద నుంచి కారు తీసుకొని అయాన్ మామిడిపల్లి సమీపంలోకి తీసుకొచ్చాడు. కారు ఓనర్ నీరజ్ ఎక్కడంటూ అతను తనకు రూ. 2 కోట్లు అప్పు ఇవ్వాల్సి ఉందని హంగామా చేస్తూ అహ్మద్ అతనితో పాటు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీంతో కారు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పహాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.