కారు ఇంజిన్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు - తప్పిన పెనుప్రమాదం - Fire broke out in Car Engine
🎬 Watch Now: Feature Video
Published : Mar 18, 2024, 4:33 PM IST
Fire Catches car In Nizamabad District : రాష్ట్రంలోని వాహనాల్లో వరుస అగ్ని ప్రమాదాలు (Fire Accident) ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో జరిగింది. ఆర్మూర్ నుంచి కామారెడ్డి వెళ్తుండగా 44వ జాతీయ రహదారిపై కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది.
Fire broke out in Car Engine in Indalwai Mandal : ఈ ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే కారు దిగి సురక్షితంగా బయటపడ్డారు. అక్కడున్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. వేసవిలో వైరింగ్ సమస్య వల్ల వేడికి కారులో సాధారణంగానే మంటలు ఏర్పడుతుంటాయి. ఈ తరుణంలో వాహనదారులు ఎప్పటికప్పుడు వాహనాలను చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు.