నడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం - తప్పిన ప్రాణ నష్టం - Car Fire Accident In Hyderabad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-02-2024/640-480-20793235-thumbnail-16x9-fire-acci.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 20, 2024, 10:22 AM IST
Fire Accident In Hyderabad : హైదరాబాద్‌లో వాహనాల్లో వరుస అగ్ని ప్రమాదాలు(Fire Accident) ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కూకట్‌పల్లిలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి కారులో ఉన్నట్టు ఉండి మంటలు చేలరేగాయి. నడుస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనంలో పొగలు కమ్ముకున్నాయి. మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన కారు డ్రైవరు అందులో ఉన్న ప్రయాణికులు వెంటనే వాహనంలో నుంచి దిగిపోయారు.
Car Caught Fire At Kukatpally : అందరూ కారులో నుంచి బయటకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనను గమనించిన స్థానికులు మట్టిపోసి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయం కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వేసవి కాలంలో వాహనాలతో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు.