హార్డ్‌వేర్ షాప్‌లో అగ్నిప్రమాదం - మంటల్లో చిక్కుకున్న నలుగురిని రక్షించిన ఫైర్ సిబ్బంది - Vikarabad Fire Accident Today - VIKARABAD FIRE ACCIDENT TODAY
🎬 Watch Now: Feature Video
Published : May 17, 2024, 2:11 PM IST
Vikarabad Fire Accident Today : వికారాబాద్ జిల్లా రామయ్యగూడా రోడ్డులోని హార్డ్‌వేర్ షాప్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
Fire Incident in Hardware Shop at Vikarabad : గంటపాటు శ్రమించి మంటల్లో చిక్కుకున్న నలుగురిని అగ్నిమాపక రక్షించారు. అనంతరం భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇది తెలుసుకున్న విద్యుత్ అధికారులు వెంటనే కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తగ్గిందని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. ప్రమాదంలో రూ.1.5 కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని షాప్ యజమాని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.