పాత ఇనుప సామగ్రి దుకాణంలో పేలిన సిలిండర్లు - తప్పిన ప్రాణనష్టం - Fire Accident At Kukatpally - FIRE ACCIDENT AT KUKATPALLY
🎬 Watch Now: Feature Video
Published : May 4, 2024, 1:48 PM IST
Fire Accident At Kukatpally Scrap Shop : హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ పాత ఇనుప సామగ్రి దుకాణంలో సిలిండర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణంలోని చిత్తు కాగితాలు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్ని మాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా చిన్న సిలిండర్లు నిల్వ ఉంచడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోయారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కాగా అనుమతులు లేకుండా సిలిండర్ల నిల్వపై స్పందించారు. దానిపై పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా వస్తువులకు చిన్న నిప్పు రవ్వ పడినా మంటలు వ్యాపించి అగ్నిప్రమాదానికి దారితీస్తున్నాయి. అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాలని అధికారులు సూచించారు. అలానే అగ్నిప్రమాదానికి గురయ్యే ప్రాంతంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరిస్తున్నారు.