కుమారుడి ప్రాణం కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్‌తో పరుగులు తీసిన తండ్రి - Father Oxygen Cylinder Video
🎬 Watch Now: Feature Video
Father Holding Oxygen Cylinder in KGH Viral Video : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కేజీహెచ్‌లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఓ తండ్రి పడిన కష్టానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణీని కుటుంబసభ్యులు మంగళవారం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. నెలలు నిండకుండానే బిడ్డకు జన్మినివ్వడంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలోలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూ (నియో ఇంటెన్సివ్ కేర్ యూనిట్)కు బయలుదేరారు.
KGH Viral Video : సమయానికి సిబ్బంది లేకపోవడంతో తండ్రి ఆక్సిజన్ సిలిండర్‌ను భుజాన వేసుకొని నర్సు వెనుక నడిచారు. ఈ దృశ్యాన్ని అక్కడున్నవారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి పర్యవేక్షక వైద్యులు, సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఇక నుంచి కేజీహెచ్‌లో బ్యాటరీ వాహనాన్ని అందుబాటులో తెస్తామని తెలిపారు.