చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం- దాడిలో రైతు మృతి - ELEPHANT Attack - ELEPHANT ATTACK
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 16, 2024, 3:43 PM IST
Farmer killed in wild elephant attack: చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. పీఎంకే తండాకు చెందిన ఓ రైతుపై పొలం నుంచి ఇంటికి వస్తుండగా దాడి చేసింది. దాడిలో రైతు కన్నానాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కన్నానాయక్ మృతి చెందటంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. పంట భూముల్లో ఏనుగులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఏనుగులు రైతులపై దాడులపై దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏనుగు దాడిపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని అటవీ శాఖ అధికారులు భరోసా కల్పించారు. ఏనుగులు గుంపు కనిపిస్తే వాటికి ఎదురు వెళ్లే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అటవీ ప్రాంతంలో ఆహారం దొరకపోవడంతో గత కొంత కాలంగా ఏనుగులు గ్రామాల్లో సంచరిస్తున్నాయి. పంటపొలాలపై పడి, అడ్డువచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్నాయని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.