పాడ్ కాస్ట్‌తో యువతలో ఉత్సాహాన్ని నింపుతున్న నవీన్ - ది గైడింగ్ వాయిస్ పేరుతో 4 భాషల్లో సేవలు - Naveen Samala About Podcast
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-02-2024/640-480-20766386-thumbnail-16x9-podcast.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 16, 2024, 3:41 PM IST
Face2Face With Podcaster Naveen Samala : పాడ్ కాస్ట్ ఇప్పుడు యువతను బాగా ఆకర్షిస్తున్న మాధ్యమం. దీని ద్వారా విద్యార్థులకు అవసరమయ్యే అంశాలపై నిపుణులతో మాటామంతీ నిర్వహిస్తూ, యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు ఓ హైదరాబాదీ. ది గైడింగ్ వాయిస్ (Pod Guiding Voice) పేరుతో ఇంగ్లీష్‌లో 2020లో పాడ్ కాస్ట్ ప్రారంభించిన నవీన్, తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని 4 భాషల్లో సేవలు అందిస్తున్నారు.
Podcaster Naveen Samala Interview : కెరీర్ గైడెన్స్ మొదలుకొని పర్సనాలిటీ డెవలప్మెంట్ వరకు దాదాపు 30కి పైగా దేశాలకు చెందిన నిపుణులతో 600లకు పైగా పాడ్ కాస్ట్ ఎపిసోడ్లు చేయటం విశేషం. ఓ వైపు సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తూనే పాడ్ కాస్ట్లోనూ సత్తా చాటుతున్న నవీన్ సామల, యువతకు అవసరమైన పాడ్ కాస్ట్‌లు చేయటం వెనకు ఉన్న అంశాలు ఏమిటి? కెరీర్ గైడెన్స్(career guidance) చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.