మాదిగలకు కాంగ్రెస్ ఎంపీ స్థానాలు కేటాయించకపోవడం చారిత్రాత్మక తప్పిదం : మోత్కుపల్లి నర్సింహులు - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 10, 2024, 6:49 PM IST
EX MLA Motkupalli Demand MP Seats for Dalits : పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కేటాయించకపోవడం బాధ కలిగే విషయమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలనే తామంతా పార్టీలోకి వచ్చామన్న ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలను చిన్న చూపు చూస్తున్నారని తాము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని తెలిపారు. కానీ తమ జాతి మొత్తాన్ని పక్కన పెట్టి అవమానించారని పేర్కొన్నారు. మాదిగలను ఎన్నికలకు దూరం పెట్టాలని చూస్తున్నారని, ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు.
ఇదే ధోరణి కొనసాగితే పార్టీకి నష్టం వాటిల్లుతుందని మోత్కుపల్లి హెచ్చరించారు. మాదిగలకు ఎంపీ స్థానాలు ఇవ్వకపోవడం చారిత్రాత్మక తప్పిదమని, ఈ తప్పును సరిచేసేందుకు పునరాలోచించాలని కోరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ తమకు దొరకడం లేదని, తనకిలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని చెప్పారు. మాదిగ కులాన్ని పార్లమెంట్‌లో కూర్చునే అవకాశం కల్పించాలని కోరారు. తాను రాజకీయల కోసం మాట్లాడటం లేదని, పార్టీ మారే ఆలోచనే లేదని మోత్కుపల్లి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు అన్నగా పక్కనే ఉండి పని చేయాలనుకునే వ్యక్తినని తెలిపారు.