LIVE : తెలంగాణ భవన్లో నిరంజన్‌రెడ్డి మీడియా సమావేశం - Niranjan Reddy Press meet
🎬 Watch Now: Feature Video
Published : Mar 20, 2024, 12:01 PM IST
|Updated : Mar 20, 2024, 12:24 PM IST
Ex Minister Niranjan Reddy Live : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రానున్న లోక్‌సభ ఎన్నికలపై మాట్లాడారు. అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి వలస వెళ్తున్న నేతల తీరుపై స్పందించారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై కూడా ఆయన మాట్లాడారు. ఇంకోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. గత ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోతోందని ఆరోపించారు. లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు చేపట్టి 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టులో కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం ఉంటుందో, ఆ పార్టీలో మీరు ఎంత కాలం ఉంటారో దేవుడికే తెలియాలని, రాబోయే రోజుల్లో హస్తం నేతలకు ఘోరమైన పరాభవం తప్పదని, అందుకు ముందే సిద్దంకావాలని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
Last Updated : Mar 20, 2024, 12:24 PM IST