అచ్యుతాపురం ఫార్మా ఘటన బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్ - JAGAN VISITED ATCHUTAPURAM VICTIMS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2024, 2:23 PM IST
Jagan Visit Atchutapuram Victims : అచ్యుతాపురం ఘటన జరిగినప్పుడు ప్రభుత్వ స్పందన సరిగా లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సత్వర స్పందన లేకపోవడం బాధాకరమని చెప్పారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు తమ సర్కార్ వెంటనే స్పందించి సహాయచర్యలు చేపట్టిందని గుర్తు చేశారు.
అంతకుముందు జగన్ అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించారు. వారి యోగక్షేమాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలని జగన్ డిమాండ్ చేశారు.
Atchutapuram SEZ Reactor Blast Updates : బుధవారం నాడు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. కార్మికుల ఆర్తనాదాలు, ఛిద్రమైన మృతదేహాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ ఘటనలో 17మంది మృతి చెందారు.