ఎన్నికల తనిఖీలలో పాల్గొన్న వీడియోగ్రాఫర్లు - డబ్బుల కోసం నిరీక్షణ - Election Videographers Agitation - ELECTION VIDEOGRAPHERS AGITATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 5:13 PM IST
Election Videographers Agitation: కృష్ణా జిల్లాలో ఎన్నికల తనిఖీలలో పాల్గొన్న వీడియో గ్రాఫర్లు డబ్బుల కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా వాహన, ప్లైయింగ్ స్క్వాడ్ తనిఖీల కోసం అధికారులు ఒక్కో నియోజకవర్గానికి 15 మంది వీడియో గ్రాఫర్లను నియమించుకున్నారు. దాదాపు 60 రోజుల పాటు వీడియో గ్రాఫర్లు జిల్లా వ్యాప్తంగా సేవలు అందించారు. రోజుకు రూ. 3 వేలు ఇస్తామని వీడియోగ్రాఫర్లతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు.
ఎన్నికలు పూర్తయి 10 రోజుల అవుతున్నా నేటికీ వీడియో గ్రాఫర్లకు అధికారులు డబ్బులు చెల్లించలేదు. తమకు డబ్బులు ఇవ్వాలని అడిగితే అధికారులు బడ్జెట్ లేదని అంటున్నారని వీడియో గ్రాఫర్లు వాపోతున్నారు. కొద్ది మొత్తం ఇచ్చి, మిగిలిన డబ్బులను పెండింగ్లో పెట్టారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకుని తమ డబ్బు తమకు ఇప్పించాలని కోరుతున్నారు. ఎన్నికల్లో వినియోగించిన ప్రైవేట్ ట్రావెల్స్ కార్లకు మాత్రం అధికారులు డబ్బులు చెల్లించేశారు. డబ్బుల కోసం వీడియో గ్రాఫర్లు కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.