LIVE : కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం - ELECTION COMMISSION OF INDIA LIVE - ELECTION COMMISSION OF INDIA LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jun 3, 2024, 12:40 PM IST
|Updated : Jun 3, 2024, 1:43 PM IST
Election Commission Of India Press Meet Live : మరికొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం (జూన్ 4వ తేదీన) ఉదయం కౌంటింగ్ మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ముందు రోజైన నేడు (సోమవారం) మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మేరకు మీడియా సంస్థలకు ఆహ్వానం పంపింది. ఎన్నికల ముగింపుపై పోల్ ప్యానెల్ సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ సమావేశంలో కౌంటింగ్ ఏర్పాట్లపై ఈసీ మాట్లాడుతున్నారు. గతంలో ప్రతి దశ పోలింగ్ ముగిసిన తర్వాత డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ప్రెస్ మీట్ నిర్వహించేవారు. కానీ ఈసారి సంప్రదాయానికి భిన్నంగా పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత, కౌంటింగ్‌కు ముందు రోజు భారత ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కౌంటింగ్ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతున్నారు.
Last Updated : Jun 3, 2024, 1:43 PM IST