LIVE: రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు స్వర్ణోత్సవ సంబరాలు - ప్రత్యక్షప్రసారం - Eenadu Golden Jubilee Celebrations - EENADU GOLDEN JUBILEE CELEBRATIONS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 2:15 PM IST

Updated : Aug 10, 2024, 5:34 PM IST

Eenadu Golden Jubilee Celebration Live :  ఐదు దశాబ్దాల క్రితం విశాఖ తీరాన పురుడుపోసుకున్న ఈనాడు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి అశేష పాఠకుల హృదయాల్లో గూడు కట్టుకుంది. అక్షరయోధుడు రామోజీరావు ఆలోచనల నుంచి 1974 ఆగస్టు 10న విశాఖ వేదికగా పుట్టిన ఈనాడు పత్రిక అనతి కాలంలోనే పాఠకుల ఆదరాభిమానాలు చూరగొని అగ్రస్థానానికి చేరుకుంది. నాటి నుంచి నేటి వరకు విశేష వార్తలు, కథనాలను అందిస్తూ పాఠకుల మనస్సుల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. కచ్చితత్వం, ప్రజాప్రయోజనం, విశ్వసనీయత, వృత్తి నిబంధన, సత్యనిష్ఠ ఈ ఐదు సూత్రాలను గతి తప్పకుండా పాటించడం వల్లే ఈనాడు ఐదు దశాబ్దాల ప్రయాణాన్ని సగర్వంగా పూర్తి చేయగలిగింది. ఈనాడును చదివాకే రోజును ప్రారంభించడం అలవాటుగా చేసుకున్న వారెందరో. ఈ స్వర్ణోత్సవ వేళ  తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాని అంబరాన్నంటుతున్నాయి.ఈనాడు స్వర్ణోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల జీవనవిధానంలో భాగమైన అద్భుత ఆవిష్కరణ ఈనాడు అని అభిప్రాయపడ్డారు. జనం కోసమే జర్నలిజం ప్రజల కోసమే పత్రికారంగమని చాటిన ఐదు దశాబ్దాల అక్షర శిఖరమని పేర్కొన్నారు. ప్రజల గళం వినిపించడానికి ఆవిర్భవించి దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోందని చంద్రబాబు వెల్లడించారు. ఈనాడు స్వర్ణోత్సవ సంబరాలు ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Aug 10, 2024, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.